Jamidika nadham lekunda yellamma paravshinchagalada?? - Thummeda

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

Thursday, April 27, 2023

Jamidika nadham lekunda yellamma paravshinchagalada??



జమిడిక నాదం లేకుండా ఎల్లమ్మ పరవశించగలదా???


భారతదేశంలో వివిధ రకాల సంస్కృతి,సంప్రదాయాలు ఉన్నాయ్. ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి సంస్కృతి లో ,సంప్రదాయాల్లో చాలా తేడాలు ఉంటాయ్. 

అలాంటి సంస్కృతిలో భాగమే ఎల్లమ్మ పండుగ. ఎల్లమ్మ పండుగను దక్షిణ భారతదేశంలో చాలా చోట్ల జరుపుతుంటారు.ఈ దేవతకి ఒక రూపం అంటూ ఏమి ఉండదు కొందరు యాప చెట్టు లో చూస్తే మరికొందరు మట్టి కుండల్లో చూస్తారు. ఎలా చూసుకున్నప్పటికి ఎల్లమ్మ దేవత దక్షిణ భారతదేశంలో వేల సంవత్సరాలుగా కొలువై గ్రామాలను కాపడుతున్నది. కొలిచిన వారికి కొంగు బంగారం అవుతుంది,తలచిన వారికి తలకింది తాసునటుంది , ఆపదలో కాపాడే ఇంటి ఇలవేల్పు అవుతుంది.


 


వేలాది సంత్సరాలుగా ఎల్లమ్మ చరిత్రను బైండ్ల వాళ్లుగా పిలవబడే కులం వాల్లు చెప్తుంటారు. బైండ్ల వాల్లు జండిక అనే వాయిద్యాన్ని వాయిస్తూ ఎల్లమ్మ తల్లిని కొలుస్తారు.ఈ జండిక నుండి వచ్చే సప్త స్వరాలకి ఎల్లమ్మ తల్లి పరవశించిపోయి కొలిచిన వారింటిలో కొలువు అవుతుంది అని ప్రసిద్ధి. ఈ జండికకి ,ఎల్లమ్మ దేవతకి అవినాభావ సబంధముంది. పురాణాల ప్రకారం పరశరాముడు ఎల్లమ్మ తల్లిని అవమానించి చంపటానికి తరుముతుంటే ముల్లోకాలు తిరిగిన ఎల్లమ్మ తల్లికి ఎవరు రక్షణ ఇవ్వకపోతే మాదిగ గూడెంలో ఒక ఇంటి ముందు ఉన్న లందలో దాక్కుంటది. అది తెలుసుకున్న పరశరాముడు ఎల్లమ్మ తల్లిని బయటకి తీయటానికి నానారకాలుగా ప్రయత్నిస్తాడు. నలుదిక్కులు వినపడేలా శబ్దం చేసే డోలుతో తెళ్ళార్లు మొక్కిన ఎల్లమ్మ తల్లి బయటకి రాదు. శబ్దంతో శాంతి పడే మామూలు దేవత ఎల్లమ్మ కాదు కదా. ఎల్లమ్మ తల్లి శాంతి పడాలి అంటే, పరవశించి పోవాలంటే బండారు తో అలంకరించినట్టి, కన కన మనే శబ్దాన్ని జనింప చేసే తోలుతో చేయబడిన జమిడిక కావాలి .ఆ జమిడిక నుండి వచ్చే సప్త స్వరాలకు ఎల్లమ్మ తల్లి పరశించిపోయి ఎన్ని లోకాల అవతల ఉన్న కొలిచిన వాల్లింట కొలువు తీరుద్ది అని తెలుసుకున్న పరశురాముడు జమిడిక నాదం తో పాటలు పాడి , ఎల్లమ్మ తల్లిని శరణు కోరితే శాంతించి లంద నుండి బయటకి వస్తుంది. జమిడిక నాదంతో మాత్రమే ఎల్లమ్మ తల్లి శాంతిః అవుతుంది. జమిడిక నాదం వింటేనే ఎల్లమ్మ తల్లి కొలువు అవ్తుంది 

ఎల్లమ్మ తల్లినీ కొలవటం అంటే డోలు దెబ్బలు కొట్టి ,హుషారు ఎత్తించే పాటలు పాడటం కాదు. ఎల్లమ్మ తల్లి పరవశించి పోయి , శాంతించుకుని కొలిచిన వాళ్ళింట్లో కొలువు అయ్యేలా చేయాలి .అలా చేయటం కేవలం జమిడిక నాధంతో , ఆ జమిడికని వినసొంపుగా వాయించే బైండ్ల కులస్తులతోనే అవుతుంది. ఇవ్వాళ వేరు వేరు కులస్తులు ఎల్లమ్మ తల్లిని కొలుస్తుంటారు .ఇదంతా కేవలం డబ్బు కోసం మాత్రమే. వాళ్ళ ద్వారా ఎల్లమ్మ కొలుపు చేసుకుంటే ఎల్లమ్మ తల్లి ఇంట్లో కొలువు అవదు. జమిడిక దెబ్బ లేకుండా ఎల్లమ్మ తల్లి పండుగలు చేసుకోవటం అంటే జీవం లేని దేహానికి అలంకరణ చేసినట్టే .

ఎన్ని యుగాలు గడిచినా ఎల్లమ్మ తల్లి పరవశించిపోయేది కేవలం జమిడిక నాదానికి మాత్రమే .......


No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot