నాన్న - జె డి ప్రభాకర్ - Thummeda

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

Sunday, June 18, 2023

నాన్న - జె డి ప్రభాకర్

 


కళ్ళల్లో సన్నటి నీటి చార 

పూర్తిగా విరబూయని పెదాలు 

స్వరంలో తెలియని నిస్సహాయత

 బరువెక్కిన నాన్న గుండె నవ్వు ఇది!


నీ చిరునవ్వు కోసం 

తన చిరునవ్వుని కోల్పోతాడు

 ఫీజులకై పస్తునుంటాడు

 నీ ఆశయాలే ఆయన ఆశలు


దూరంగా ఉండి పని చేసినా

 మనసు ఎప్పుడూ నీ మీదే!

 బహుశా త్యాగం, దూరం, బాధ్యత

 నిజమైన ప్రేమేమో!


రంగు వెలిసిన చొక్కాను తాను వేసుకుని

 రంగుల చొక్కాను నీకు కొనిస్తాడు


సూర్యుడుతో పాటే లేస్తాడు 

సూర్యుడికి ధీటుగా పనిచేస్తాడు

 సూర్యుడిలాగే జీవితానికి వెలుగవుతాడు

 సూర్యుడిలాగే అస్తమిస్తాడు

 వెలుగు ఉన్నప్పుడే రోజూ నాన్నను ప్రేమతో గౌరవిద్దాం


ఈ కవిత ప్రాసలతో అందంగా ఉండకపోవచ్చు నాన్న జీవితంలాగే!

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot