వర్షం పడుతున్నప్పుడు మట్టి నుండి వచ్చే సువాసన ఎంత బాగుంటదిదో కదా..... - Thummeda

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

Saturday, April 22, 2023

వర్షం పడుతున్నప్పుడు మట్టి నుండి వచ్చే సువాసన ఎంత బాగుంటదిదో కదా.....

 కొద్దికాలంగా సమయం సందర్భం లేకుండా కురుస్తున్న వర్షాలనీ చూస్తుంటే చాలామంది కి చిరాకు గ అనిపిస్తుంది.వర్షం వస్తుంది అంటే డోర్స్,కిటికీలు అన్ని మూసేసి మొబైల్ ఫోన్ పట్టుకుని కూర్చోవటం మన అందరికీ అలవాటు అయింది. ఇంక ఈ మధ్య వరదలు బాగా రావటం వలన వర్షం అన్న,వర్షాకాలం అన్న తెగ భయపడిపోతున్నారు .వర్షం సూచనలు కనిపిస్తే ఉద్యోగస్తులు, షాపింగ్ కి వెళ్ళిన వాళ్ళు ,వేరే పని మీద బయటకు వెళ్ళినవాళ్ళు అందరూ ఇంటి దారి పడుతున్నారు.అంతలా భయపెడుతున్నయి వర్షాలు. 

ఇదంతా సిటీ లైఫ్ కి అలవాటు పడిన వాళ్ళకి.కానీ ఊర్లో ఉండే వాళ్ళకి వర్షం వస్తుంది అంటే పండగే.వర్షం వచ్చే ముందు ఆకాశం అంతా మబ్బు కమ్మేసి నేనోస్తున్నను అని సిగ్నల్ ఇచేస్తుంది.వాతావరణం అంతా ప్రశాంతంగా ,నిశబ్దంగా మారుతుంది.అప్పుడు ఆ క్షణం ఒక నీటి బిందువు మబ్బుని చీల్చుకుంటూ వేగంగా వచ్చి భూమితో కలిసిపోతుంది.


అప్పుడు ....అప్పుడు భూమి నుండి వచ్చే సువాసన ఎంత మధురంగా ఉంటుంది.అప్పటి వరకు చల్లగా తాకుతున్న గాలి, చినుకులు చుట్టూ మట్టి మాధుర్యంతో కలిసి పోయి భుమితల్లి సువాసనలు వెజల్లుతుంధి.ఆ స్వచమైన సువాసన మనసుకి ,దేహానికి ఎంతో ప్రశాంతతని ఇస్తుంది.ఆ గాలిని అల పెల్చుతుంటే దేహంలో ఉన్న సర్వరోగాలు పోతున్నట్టుగా , తేలికగా అనిపిస్తుంది.




అలాంటి మాధుర్యం కావాలంటే గ్రామాల్లోనే దొరుకుతుంది. స్వచ్ఛమైన నేల నుండి మాత్రమే అలాంటి సువాసనలు జనిస్తాయి.సంవత్సరంలో ఒక్కసారి అయినా ఊర్లో చిరుజల్లు కురుస్తున్నప్పుడు ఆ సువాసలను ఆశ్వధించటానికి ఊర్లోకి వెళ్దాం.....

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot