తల్లి నా వెలిశాల సాంగ్ లిరిక్స్.....thalli na velishala song lyrics - Thummeda

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

Friday, June 30, 2023

తల్లి నా వెలిశాల సాంగ్ లిరిక్స్.....thalli na velishala song lyrics





తల్లి నా వెలిశాల
నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల 
తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా 
నల్లని రేగల్ల ఎర్రని మల్లెలు నెత్తురు వేసుకున్న నేల 
తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా 
తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల

తూర్పుదిక్కున మోదుగు మొక్కల్లో 
దిక్కుల్ని శాసించే శక్తుల్ని కన్నావు.....
ఉయ్యాలలు ఊపావు జంపాల లూపావు
ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టావు
ఎండిన ఆకుల ఎన్నిపూసల నుండి 
ఆయుధాలు తీసి పోరాడమన్నావు
తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలాతల్లి నా వెలిశాల

పడమటి కొండల్లో వాలేటి పొద్దును
వేలెత్తి చూపావు ఉదయించమన్నావు
అన్యాయం అన్నది ఎదిరించమన్నావు
న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు 
దీనుల కళ్ళల్లో పేదోల్ల ఇళ్లలో
దీపాలు మీరైనా చాలు బిద్దన్నావు 
తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల

పచ్చని పైరుల్లో వెచ్చాని నెత్తురు చిల్లిన
నీ కంట్లో కన్నీరు దాచావు 
తడి ఆరిపోనాటి మరకల్ని చూపెట్టి
పోరుల్లో త్యాగాల తొలి మెట్టు అన్నావు 
తెలుసుకోమన్నావు తలుచుకోమన్నావు
పేదల్ల రాజ్యాన్ని సాధించమన్నావు 
తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల

దేశాన్ని కాపాడే సైనిక బిడ్డలా 
బతుకుదెరువు లేక బాడరుకు పంపావు 
అరచేత పెంచావు ఆయుధాన్నిచ్చావు
సరిహద్దు సేవలో సాగిపోమన్నావు
శత్రువులకే నాడు తలవంచకన్నావు 
కన్నందుకు తల వొంపుతే కన్నావు 
తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల 

త్యాగాల కాగితం మరణాల సంతకం
నీ గుండె గొంతుతో చదువుకోమన్నావు 
ఉద్యమం ఏనాడు ఓడిపొదన్నావు
రాజకీయాలను కులదోయమన్నావు
ఎర్రజెండా నెత్తి దొరల గుండెపై 
దండుతో దాడి చేయమన్నావు

తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల తల్లి 
నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా
నల్లని రేగల్లు తెల్లని మల్లెలు నెత్తురు వేసుకున్న నేల తల్లి నా వెలిశా నీకున్నది చరిత్ర చాలా
#tallinavelishalasong
#tallinavelishalasonglirycs
#telugusongslirycs

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot