బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న రహస్యం ఇదే...!! - Thummeda

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

Sunday, April 30, 2023

బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న రహస్యం ఇదే...!!




    సాధారణంగ మహిళలు బొట్టు పెట్టు కోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు.  బొట్టుపెట్టుకోవడం  హిందూ సాంప్రదాయం లో ఎక్కువగా కనిపిస్తుంటది . బొట్టు పెట్టుకోవడం అనేది ప్రతి ఆడవారిని, మగవారిని అందంగా,ఆకర్షణీయంగా, అణుకువగా చూపించడం లో ప్రధాన పాత్ర పోషిస్తుంది.  బొట్టును చాలా మంది చాలా రకాలుగా పెట్టుకుంటుంటారు. కాని బొట్టును రెండు కనుబొమ్మల మధ్యలోనే ఎందుకు పెట్టుకుంటారో చాలామందికి తెలియదు.   దీనికి  ఒక కారణం ఉంది, అది మనలో ఉండే నాడీ వ్యవస్థకి కేంద్రస్థానం అయిన ఆజ్ఞచక్రం అనేది మన రెండు కనుబొమ్మల మధ్యలోనే ఉంటుంది.


     సరిగ్గా ఆజ్ఞచక్రం అనగా రెండు కనుబొమ్మల మధ్యనుండి ఒక సరళరేఖను వెనుకకు గీసినచో, అలాగే మన, వెన్నుముక కింద భాగం నుండి పైకి మరల ఒక సరళరేఖను గీసిన, ఇవి రెండు కలిసే ప్రదేశం ఒకటి ఉంది. అవే మన మెదడులో ఉండే' పెట్యూటరీ బాడీ పీనియల్ గ్లాండ్స్' మనం బొట్టుని పెట్టుకొని ఆ ప్రదేశంలో మన వెలితో బొట్టుపై ఒత్తిడి చేయడం వలన అజ్ఞాచక్రం పై ఒత్తిడి కలిగి గ్లాండ్స్ లో కదలికలు జరుగుతూ మన మెదడును చురుకుగా పని చేసేలా చేస్తుంది.దీని వలన మన శరీరంలో 72 నాడులు కూడా సక్రమంగా పని చేస్తాయి. అలా బొట్టు మన మెదడు చురుకుగా పనిచేయడం లో ప్రధాన పాత్ర పోషిస్తుంది.


    ఇదే కాకుండా సూర్యుడి నుండి వచ్చే సూర్యకిరణాలను గ్రహించే శక్తి మన నాడీమండలానికి కేంద్రస్థానం అయిన ఆజ్ఞచక్రం కే ఉంది అలా వచ్చే వెలుగును గ్రహించే వారిలో అత్మ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది.


    ఇది ఇలా ఉండగా బొట్టును ఎలా పెట్టుకోవాలి అనే సందేశం చాలా మందిలో ఉంటుంది. అంటే ఏ వేలుతో పెట్టుకుంటారు అనే సందేహాలు లాంటివి. బొట్టును బొటనవేలితో పాటుగా మధ్యవేలును గానీ, ఉంగరం వేలును గానీ ఉపయోగించాలి. చూపుడు వేలును ఉపయోగించకూడదు అంటారు. ఎందుకంటే శాస్త్రం ప్రకారం పితృకార్యాలకు అంటే తద్దినాలు కాని, పిండం పెట్టడం కోసం చూపుడు వెలును ఉపయోగిస్తారు. కావున పెద్దలు అందరూ కూడా చూపుడు వేలును బొట్టు పెట్టుకోవడానికి ఉపయోగించకూడదూని అంటారు. ఇదే బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న అసలు  రహస్యం...

    No comments:

    Post a Comment

    Post Top Ad

    Your Ad Spot