అబద్ధ శుద్దీకరణ- అంబాదాస్ - Thummeda

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

Saturday, June 3, 2023

అబద్ధ శుద్దీకరణ- అంబాదాస్

అబద్ధ శుద్ధికరణ

 

అబద్ధాల అర్రలో

ఎన్నాళ్ళీ సేదతీరటము….

నిజాల నిప్పు పై 

అడుగేసి చూద్దామా?

కాళ్ళకంటిన ధూళెలా

మసైపోతుందో!...


ఎప్పుడో అన్నారెవరో….

రైతుల కన్నీటెదురుచూపులకు

అన్నదాన దోషముందని

ఎప్పుడో కలగన్నారెవరో…

ఒక్కపూట …

పేదవాళ్ళ ఆకలిహోమంలో

నెయ్యాన్నం పోసామంటే

అన్నపూర్ణదేవి సాక్షాత్కరిస్తుందని


 చేతిపై నున్న

 గీతల్ని చెరిపెంత వరకు

 మొలకలకు చెమటచుక్కల్ని

 చిందిస్తే చాలదా!

 నుదుటి రాతను మార్చేయడానికి!


 ఎందుకో ఆలోచించరెవరు…

 నిరాశాఖరికి…

 నిప్పులా ఎదగదులలో 

 రక్తాన్ని వేడి చేసిపోతుందని


 మ్యాజిక్కు మాయలోని

 మర్మమెరిగిన శాస్త్రాలు…

 లాజిక్కు దిక్కులో

 అజ్ఞానాన్ని మెల్లమెల్లగా

 అస్తమింపజేస్తున్నాయి…

       

   – జాధవ్ అంబదాస్

 




















 

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot